రాజధాని కోసం రాయలసీమలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. రాయలసీమ రాజధాని సాధన సమితి గురువారం సీమ బంద్కు పిలుపునిచ్చింది.
కర్నూలు : రాజధాని కోసం రాయలసీమలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. రాయలసీమ రాజధాని సాధన సమితి గురువారం సీమ బంద్కు పిలుపునిచ్చింది. రాయల సీమలోని నాలుగు జిల్లాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో రాయలసీమ విద్యార్థి సంఘాలు వైఎస్‌ఆర్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి.
తెల్లవారుజాము నుంచే ఆందోళనకారులు వాహనాలను నిలిపివేసి నిరసన చేపట్టారు. కడప అంబేద్కర్ సర్కిల్లో టైర్లు తగులబెట్టి ఆందోళన నిర్వహించారు. డిపోల్లోంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్ సమాచారం ముందుగా తెలియజేయడంతో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. శ్రీబాగ్ ఒప్పందానికి కట్టుబడి రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటుచేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.