రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ లిమిటెడ్ నూతన పాలక మండలి ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు,
నేడు రాజమండ్రి చాంబర్ ఎన్నికలు
Sep 30 2013 12:53 AM | Updated on Aug 14 2018 5:54 PM
రాజమండ్రి రూరల్, న్యూస్‌లైన్: రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ లిమిటెడ్ నూతన పాలక మండలి ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా తీసుకుని ఇతర పార్టీలతో కలసి ప్యానళ్లను తయారు చేసి బరిలో ఉంచారు. తొలుత రౌతు వర్గీయుడైన నందెపు శ్రీనివాస్‌ను మరో ఏడాది కొనసాగించాలని నిర్ణయించారు. ప్రత్యర్థి వర్గం అడ్డుకోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. నందెపును కొనసాగించే విషయంలో రౌతు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్నికలు జరి పించడంలో శివరామసుబ్రహ్మణ్యం సఫలమయ్యారు.
శ్రీఘాకోళ్లపు, కొంత మంది చాంబర్ మాజీ అధ్యక్షుల మద్దతుతో మద్దుల మురళీ కృష్ణ, చవ్వాకుల రంగనాథ్ అధ్యక్ష, గౌరవ కార్యదర్శులుగా ప్యానల్ నిలిచారు. ఎమ్మెల్యే రౌతు, మరి కొంత మంది మాజీ చాంబర్ అధ్యక్షుల మద్దతుతో అశోక్‌కుమార్ జైన్, బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు ప్యానల్‌గా పోటీలో ఉన్నారు. ఈ రెండు ప్యానల్‌ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అధ్యక్ష బరిలో నిలిచిన నల్లమిల్లి శ్రీ రామారెడ్డి పోటీ నుంచి తప్పుకుని మద్దుల మురళీకృష్ణ ప్యానల్‌కు మద్దతు తెలిపారు. మరో అధ్యక్ష అభ్యర్థి కేవైఎన్ బాబు మాత్రం బరిలో నిలిచారు.
అధ్యక్ష స్థానానికి ఈయన చీల్చే ఓట్లపైనే ఫలితం ఆధారపడి ఉంటుందని వర్తకులు పేర్కొంటున్నారు. 2130 మంది వర్తకులు, 39 అసోసియేషన్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నా రు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అధ్యక్ష, గౌరవ కార్యదర్శి పదవులతో పాటు, రెండు ఉపాధ్యక్ష పదవులు, ఒక కోశాధికారి, ఒక గౌరవ సంయుక్త కార్యదర్శి, మూడు ట్రస్టు బోర్డు డెరైక్టర్ పదవులకు,15 డెరైక్టర్ పదవులకు ఎన్నికలు జరుగనున్నా యి. ఎమ్మెల్యే రౌతు, శివరామ సుబ్రహ్మణ్యం వర్తకుల్లో పట్టు సాధించేందుకు తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికలపై వర్తక వర్గంలో ఆసక్తి నెలకొంది.
Advertisement
Advertisement