ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్ర, తెలంగాణల్లో ఉష్ణోగ్రతలు తగ్గుమఖం పట్టే అవకాశం ఉందని విశాఖలోని వాతవరణకేంద్రం తెలిపింది. ఈనెల 30, 31లోపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, అల్పపీడనం కారణంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం కారణంగా రాయలసీమ, కోస్తాంధ్రల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుసే అవకాశం ఉందని, తెలంగాణలో వడగాల్పులు కొనసాగువచ్చని అధికారులు తెలిపారు.
కాగా నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా తుమ్మడం గ్రామంలోని ఓ తోటలో పిడుగుపాటుకు ఉస్మాన్(55) అనే వ్యక్తి మృతిచెందాడు. కర్నూలు జిల్లా శ్రీశైలం, విశాఖపట్నం జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా దర్శిలో పిడుగుపాటుకు ఓ మహిళ మరణించింది. వైఎస్పార్ జిల్లా కాశినాయన, కలసపాడు మండలల్లో పిడుగుపాటుకు మూడు గేదెలు మృతిచెందాయి.