పెరిగిన రైల్వే ఆదాయం | Railway income increased | Sakshi
Sakshi News home page

పెరిగిన రైల్వే ఆదాయం

Nov 9 2013 2:37 AM | Updated on Sep 2 2017 12:25 AM

వరుస తుపానులతో తీవ్రంగా నష్టపోయిన రైల్వే ప్రస్తుతం కోలుకుంది. ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ కూడా రెట్టింపైంది.

ఆమదాలవలస, న్యూస్‌లైన్:  వరుస తుపానులతో తీవ్రంగా నష్టపోయిన రైల్వే ప్రస్తుతం కోలుకుంది. ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీ కూడా రెట్టింపైంది. తుపానుల ప్రభావంతో కురిసిన వర్షాలకు ట్రాక్ దెబ్బతినడంతో కొన్ని రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని దారిమళ్లించి నడిపారు. దీంతో రైల్వే ఆదాయానికి భారీగానే గండి పడింది. ప్రస్తుతం ట్రాక్ పనులు పూర్తైరైళ్లు యథావిధిగా రాకపోకలు సాగిస్తుండడంతో మళ్లీ ప్రయాణికుల రద్దీ పెరిగింది. శుక్రవారం రైళ్లన్నీ కిటకిటలాడుతూ కనిపించాయి. సాధారణ టిక్కెట్ల విక్రయం ద్వారా రూ 3.76 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement