పెళ్లిచూపులకు వచ్చి.. | railway employee died in srikakulam | Sakshi
Sakshi News home page

పెళ్లిచూపులకు వచ్చి..

Aug 5 2018 9:22 AM | Updated on Sep 28 2018 3:39 PM

railway employee died in srikakulam - Sakshi

సంతబొమ్మాళి: ఒడిశాలోని బలంగిరిలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న గిన్ని వైకుంఠరావు(35) పెళ్లి చూపుల కోసం తన స్వగ్రామమైన నౌపడకు మూడు రోజుల క్రితం వచ్చాడు. పెళ్లి చూపులు ముగించుకుని శుక్రవారం రాత్రి నౌపడ రైల్వే స్టేషన్‌లో రైలులో బలంగిరి బయల్దేరారు. రాయిఘడ వద్ద వాటర్‌ బాటిల్‌ కోసం రైలు దిగాడు. కొద్దిసేపటికే రైలు బయలుదేరడంతో బోగీ ఎక్కే ప్రయత్నంలో కాలు జారి పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వైకుంఠరావును రాయిఘడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. అక్కడ పోస్టుమార్టం పూర్తయిన తర్వాత శనివారం స్వగ్రామమైన నౌపడ    వ చ్చి దహన సంస్కారాలు చేశారు. కుమారుడు మృతి చెందడంతో తల్లి రమణమ్మ బోరున విలపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement