రాహుల్‌గాంధీకి ఎవరి ద్వారా ఎలాంటి ప్రాణహాని ఉందో బయటపెట్టాలని బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్ విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు.
రాహుల్‌గాంధీకి ఎవరి ద్వారా ఎలాంటి ప్రాణహాని ఉందో బయటపెట్టాలని బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్ విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. అలాంటిదేమీ లేకపోతే మాత్రం రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు.
దేశంలో శాంతి భద్రతలు దిగజారినట్లు చూపించి, అత్యవసర పరిస్థితి తీసుకొచ్చి, రాజ్యాంగబద్ధంగా కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితిపై రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని విద్యాసాగర్‌రావు హెచ్చరించారు.