పాలిటెక్నిక్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం | raging incident in vishaka politechnic college | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

Nov 27 2015 5:09 PM | Updated on Sep 19 2019 2:50 PM

నాగార్జునా యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ మూలాన రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

విశాఖపట్నం: నాగార్జునా యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ మూలాన రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాగింగ్ కు వ్యతిరేకంగా దుమారం రేగుతున్నా ర్యాగింగ్ ఘటనలు మాత్రం ఆగడం లేవు. తాజాగా విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. కొందరు సీనియర్ విద్యార్థులు తమను వేధించారంటూ జూనియర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కాలేజీ యాజమాన్యం శుక్రవారం ఐదుగురు విద్యార్థులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement