breaking news
politechnic
-
పాలిటెక్నిక్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు: బొత్స
-
వాట్సప్ చివరి స్టేటస్.. ఊరి నుంచి తెచ్చుకున్న అమ్మ చీరతోనే ఉరేసుకుని..
సాక్షి, ఒంగోలు/విశాఖపట్నం: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన అమ్మ చీరతోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం పాత ఆదినారాయణ సంత సమీపంలోని గుల్లేపల్లి గ్రామానికి చెందిన వెసలపు పాతబాబు, నారాయణమ్మ దంపతుల కుమారుడు వి.వరుణ్ సాయి (17) ఒంగోలులోని దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో హాస్టల్ నెల రోజుల క్రితమే తెరుచుకుంది. హాస్టల్ వార్డెన్ కరోనా రావడంతో సెలవులో ఉన్నాడు. హాస్టల్లో ఉంటున్న వరుణ్‌వాసు పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి గత ఆదివారం హాస్టల్‌కు తిరిగి వచ్చాడు. తరగతులకు వెళ్లకుండా.. ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి హాస్టల్ వదిలి క్లాసులకు వెళ్లడం లేదు. ఏమిటి అంటే ఆరోగ్యం బాగోలేదని చెబుతుండడంతో సహచర విద్యార్థులు పట్టించుకోలేదు. వచ్చేటప్పుడు చీరె తీసుకొని వచ్చాడు. చీరె ఎందుకు తెచ్చావు అంటే మా అమ్మది.. కప్పుకోవడానికి ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. గురువారం నుంచి వీరికి మిడ్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు వరుణ్‌వాసు హాజరుకాకపోవతుండటంతో తోటి విద్యార్థులు అడిగితే ప్రస్తుతం ప్రిపేర్ కాలేదని, చివరి పరీక్షల్లో బాగా మార్కులు తెచ్చుకుంటానని చెప్పాడు. శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి తన గదికి వెళ్లాడు. కొద్ది సేపటికి.. కొద్దిసేపటి తరువాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా వరుణ్‌వాసు తన తల్లి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో వాళ్లు హాస్టల్ గది తలుపుని బలవంతంగా తెరిచి ఫ్యాన్‌కు వేలాడుతున్న అతనిని చీరె నుంచి తప్పించి హాస్టల్ వాచ్‌మన్‌కు ఫోన్ చేశారు. వాచ్‌మన్ వచ్చి అప్పటికే స్పృహ లేకుండా ఉన్న వరుణ్‌ను రిమ్స్‌కు తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి మృతిచెందినట్లు నిర్థారించారు. చదవండి: డ్రగ్స్ కేసు: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు ప్రధాన నిందితుడు టోనీ చివరి వాట్సప్ స్టేటస్ వాట్సప్ స్టేటస్‌లో.. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి రిమ్స్‌కు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడంతో పాటు హాస్టల్లో విద్యార్థులను విచారించారు. వరుణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై అతని వాట్సప్‌ను పరిశీలించగా అందులో స్టేటస్ ‘డెత్...దిడే పీపుల్ విల్ టాక్ గుడ్ ఎబౌట్ యు...గుడ్‌బై ’ అని పోస్టు చేసి ఉంది. దీంతో అతను ఈ పోస్టును ఎవరిని ఉద్దేశించి చేశాడనేది తెలియలేదు. చదవండి: సీఎం దృష్టికి వెళ్లకుండా చూస్తాం.. రూ.25లక్షలు ఇవ్వు.. డీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు తల్లిదండ్రులకు సమాచారం.. వరుణ్ కాలేజీలో విద్యార్థులందరితో కలివిడిగా ఉంటాడని, మంచివాడు అంటూ చెబుతున్నారు. పోలీసులు విషయాన్ని వైజాగ్‌లోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీనిపై తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రాథమికంగా తమ విచారణలో కాలేజీకి సంబంధించి బాలునికి ఎటువంటి సమస్యలు లేవని తేలిందని, అంతే కాకుండా సెలవుల నుంచి కాలేజీకి వచ్చినప్పటి నుంచి తరగతులకు కూడా హాజరుకాలేదని తెలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందనే దానిపై బాలుని తల్లిదండ్రులు వచ్చిన తరువాత వారు చెప్పే సమాధానం, బాలుని వాట్సప్ సందేశాలను పరిశీలించిన తరువాత పూర్తి విషయాలు వెల్లడిస్తామన్నారు. -
లెక్చరర్ పార్వతి వేధింపుల కారణంగా..
బడంగ్పేట్: పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మీర్పేట్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బడంగ్‌పేటకు చెందిన ఎల్లయ్య, స్వప్న దంపతులు మీర్‌పేటలోని ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరి చిన్న కుమార్తె సంధ్య మీర్‌పేటలోని తీగల రాంరెడ్డి పాల్టెక్నిక్ (టీఆర్ఆర్) కాలేజీలో ఫైనలియర్(సీఎంఈ) చదువుతోంది. అదివారం తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లడంతో సంధ్య, ఆమె తాత మాత్రమే ఇంట్లో ఉన్నారు. తాత హాల్లో నిద్రిస్తుండగా, సంధ్య బెడ్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. మూడు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన ఆమె తల్లితండ్రులు సంధ్యను పిలిచినా తలుపులు తెరవకపోవడంతో బద్దలు కొట్టి చూడగా సంధ్య చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. హడావిడిగా అంత్యక్రియలు: దీంతో తల్లిదండ్రులు సమీపంలో బంధువులకు సమాచారం అందించారు. వారితో కలిసి హడావుడిగా సాయంత్రం బడంగ్‌పేట స్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా సంధ్య ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సివుంది. ఈ విషయంపై మీర్‌పేట పోలీసులను వివరణ కోరగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. విద్యార్థుల ధర్నా సంధ్య ఆత్మహత్యపై సమాచారం అందడంతో సోమవారం కళాశాలలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. లెక్చరర్ పార్వతి వేధింపుల కారణంగా సంధ్య ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ ఆమెపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా లెక్చరర్ పార్వతిని సస్పెండ్ చేస్తున్నట్లు కళాశాల యాజమన్యం ప్రకటించింది. సంధ్య కుటుంబానికి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. -
పాలిటెక్నిక్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
విశాఖపట్నం: నాగార్జునా యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ మూలాన రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాగింగ్ కు వ్యతిరేకంగా దుమారం రేగుతున్నా ర్యాగింగ్ ఘటనలు మాత్రం ఆగడం లేవు. తాజాగా విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. కొందరు సీనియర్ విద్యార్థులు తమను వేధించారంటూ జూనియర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కాలేజీ యాజమాన్యం శుక్రవారం ఐదుగురు విద్యార్థులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది. -
ఈ-సెట్ షెడ్యూలు విడుదల
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ-సెట్ పరీక్ష నిర్వహణ షెడ్యూల్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం...ఈ నెల 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పరీక్షను మే 21న నిర్వహిస్తారు. దీనికోసం పాలిటెక్నిక్ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 6 నుంచి ఏప్రిల్ 15 వరకు గడువు విధించారు. ఆలోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.