మరోసారి ‘హోదా’ తీర్మానం చేయాలి | Raghuveera Reddy comments on AP Special status | Sakshi
Sakshi News home page

మరోసారి ‘హోదా’ తీర్మానం చేయాలి

Feb 27 2017 1:51 AM | Updated on Mar 29 2019 9:31 PM

మరోసారి ‘హోదా’ తీర్మానం చేయాలి - Sakshi

మరోసారి ‘హోదా’ తీర్మానం చేయాలి

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ రాజకీయ లబ్ధికోసం కాకుండా ప్రజాసమస్యలపై చర్చించేందుకు ప్రయత్నించాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి

సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ రాజకీయ లబ్ధికోసం కాకుండా ప్రజాసమస్యలపై చర్చించేందుకు ప్రయత్నించాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు. విశాఖలో ఆదివారం  ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాసమస్యలపై చర్చించాలంటూ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజులకు లేఖలు రాయనున్నట్లు చెప్పారు.

శాసనసభ సమావేశాలను 30 పనిదినాలకు తగ్గకుండా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈసారి కూడా ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలంతా ఆ తీర్మానాన్ని తీసుకుని ఢిల్లీ వెళ్లి కేంద్రంతో పోరాడాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement