ఆంధ్రా యూనివర్సిటీ వీసీకి ఘన స్వాగతం

PVGD Prasad Reddy Recieves Grand Welcome In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఆంధ్రా యూనివర్సిటీని మొదటి స్థానంలో నిలబెట్టాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశయాన్ని నిజం చేస్తానని ఏయూ వైస్‌ చాన్సలర్‌ పివిజిడి ప్రసాద్‌ రెడ్డి హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టిన పివిజిడి ప్రసాద్ రెడ్డికి ఏయూ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యూనివర్సిటీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. యూనివర్సిటీ నిధులను గత ప్రభుత్వం పసుపు కుంకుమ కోసం వినియోగించిందని ఆరోపించారు. దీంతో నిధుల కొరత ఏర్పడిందని తెలిపారు. ఉన్నదానిలో అభివృద్ధి పనులు చేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీని నడిపిస్తామని స్పష్టం చేశారు. తాను కూడా విద్యార్థి దశ నుంచే ఈ స్థాయికి వచ్చానని అన్నారు. ప్రతీ విద్యార్థికి బంగారు భవిష్యత్‌ను అందిస్తామని భరోసా కల్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top