జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై పీటీ వారెంట్ | PT Warrant On JC Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

తండ్రీ కొడుకులపై పీటీ వారెంట్

Jun 16 2020 8:17 AM | Updated on Jun 16 2020 8:17 AM

PT Warrant On JC Prabhakar Reddy - Sakshi

సాక్షి, అనంతపురం: దివాకర్‌ ట్రావెల్స్‌ అక్రమాల్లో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు మూడు కేసులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌ రెడ్డిలపై సోమవారం కోర్టులో పీటీ వారెంట్‌(క్రైం నెంబర్‌ 33) వేశారు. గతేడాది జఠాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తుక్కు కింద బీఎస్‌ 3 వాహనాలను కొనుగోలు చేశారు.

తప్పుడు ఇన్‌వాయిస్‌లతో తుక్కు కింద కొనుగోలు చేసిన ఆ వాహనాలను నాగాలాండ్‌ రాజధాని కొహిమా.. అనంతపురం, ఇతర రాష్ట్రాల్లో బీఎస్‌ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేయించారు. అనంతపురంలో రిజిస్ట్రేషన్‌ చేయించిన 80 వాహనాలపై రవాణాశాఖాధికారులు వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసులకు సంబంధించి వన్‌టౌన్‌ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్‌ను వేశారు. తండ్రీ, కొడుకులు కడప కారాగారంలో ఉండగానే పోలీసులు పీటీ వారెంట్‌ నమోదు చేయడం చర్చనీయాంశమైంది. మెజిస్ట్రేట్‌ పీటీ వారెంట్‌పై విచారణ నేటికి(మంగళవారం) వాయిదా వేశారు. చదవండి: ‘జేసీ బ్రదర్స్‌’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు

బెయిల్‌ దాఖలు.. 
జేసీ ప్రభాకర్‌ రెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డిల బెయిల్‌కు సంబంధించి సోమవారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలైంది. రెండు బస్సులకు సంబంధించి నకిలీ పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌తో ఎన్‌ఓసీ పొందిన కేసులో ఈ నెల 13న ఏ2 జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఏ6 జేసీ అస్మిత్‌ రెడ్డిలకు మెజిస్ట్రేట్‌ 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. ఈ క్రమంలో వన్‌టౌన్‌ పోలీసులు వారిని కడప కారాగారానికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్‌ దరఖాస్తుపై విచారణను మెజిస్ట్రేట్‌ నేటికి వాయిదా వేశారు. చదవండి: జేసీ ప్రభాకర్‌ రెడ్డికి కరోనా పరీక్షలు

Advertisement
 
Advertisement
Advertisement