ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఖైదీ మృతి | prisoner died during treatment | Sakshi
Sakshi News home page

ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఖైదీ మృతి

May 5 2015 7:07 PM | Updated on Sep 3 2017 1:29 AM

ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ ఖైదీ చనిపోయాడు.

అఫ్జ్జల్‌గంజ్ (హైదరాబాద్) : ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ ఖైదీ చనిపోయాడు. అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హత్య కేసులో శిక్ష పడి వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కర్నాటి బాబూరావు(29) అనే వ్యక్తి కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కాగా గత నెల 29వ తేదీన వరంగల్ జైలు నుంచి అతడిని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలోని ఖైదీల వార్డులో చికిత్స పొందుతున్న బాబూరావు పరిస్థితి విషమించి సోమవారం అర్థరాత్రి మృతి చెందాడు. అతనిది ఖమ్మం జిల్లా చింతూరు. మంగళవారం పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement