
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని పిలుపునకు మద్దతుగా రేపు రాత్రి (ఆదివారం) 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. సీఎం జగన్ ట్వీట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సీఎం జగన్ మద్దతు.. కరోనాపై మనందరం కలిసి పోరాడాలన్న స్ఫూర్తినిస్తుందంటూ ట్విట్టర్‌లో మోదీ పేర్కొన్నారు.