చిరు పోస్టర్లపై నల్లరంగు పూసిన టిడిపి కార్యకర్తలు | Posters dispute in Nellore | Sakshi
Sakshi News home page

చిరు పోస్టర్లపై నల్లరంగు పూసిన టిడిపి కార్యకర్తలు

Feb 27 2014 6:45 PM | Updated on Oct 20 2018 6:17 PM

వివాదానికి దారి తీసిన పోస్టర్ - Sakshi

వివాదానికి దారి తీసిన పోస్టర్

నగరంలో పోస్టర్ల వివాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి చిరంజీవి ఉన్న పోస్టర్లపై టిడిపి కార్యకర్తలు నల్లరంగు పూశారు.

నెల్లూరు: నగరంలో పోస్టర్ల వివాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి చిరంజీవి ఉన్న పోస్టర్లపై టిడిపి కార్యకర్తలు నల్లరంగు పూశారు. నెల్లూరు నగర శాసన సభ్యుడు ముంగమూరు శ్రీధర్‌ కృష్ణారెడ్డి టిడిపిలో చేరనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా  ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్‌కృష్ణా రెడ్డి, బండారు సత్యానందరావులు ఆ పార్టీకి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. వారిలో శ్రీధర్‌ కృష్ణారెడ్డి టిడిపిలో చేరుతున్న సందర్భంగా పోస్టర్లు వేయించారు.

ఆ పోస్టర్లే వివాదానికి దారితీశాయి. ఆయన వేయించిన పోస్టర్లలో చిరంజీవి ఫొటో ఉంది. ఆయన ఇక్కడ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున గెలుపొందారు. ఆ అభిమానంతో ఆయన చిరంజీవి ఫొటో పోస్టర్లో వేయించినట్లున్నారు. అది టిడిపి కార్యకర్తలకు గిట్టలేదు.  వారు అభ్యంతరం చెప్పారు. అంతేకాకుండా ఆ పోస్టర్లపై  నల్లరంగు పూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement