తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనపై బాబు రెండు కళ్ల సిద్ధాంతం వికటిస్తుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు.
చంద్రబాబు అస్పష్ట విధానాలతో అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో టీడీపీ ఘోరంగా నష్టపోయిందన్నారు. ఈ నెల 17న జరగనున్న ఏఐసీసీ సదస్సులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు పొంగులేటి వివరించారు.