ఆత్మహత్యగా నమ్మించబోయి.. | Police shoot suicide misguided husband kills wife | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యగా నమ్మించబోయి..

Jan 14 2014 2:36 AM | Updated on Sep 2 2017 2:36 AM

భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించిన భర్త నిజాలు వెలుగులోకి రావడంతో కటకటాలపాలయ్యా డు.

దుండిగల్, న్యూస్‌లైన్ : భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించిన భర్త నిజాలు వెలుగులోకి రావడంతో కటకటాలపాలయ్యా డు. సోమవారం దుండిగల్ సీఐ బాల కృష్ణ కేసు వివరాలు వెల్లడించారు. పశ్చి మ గోదావరి జిల్లా పాలకోడేరు మం డలం మోగల్లు గ్రామానికి చెందిన పెనుమత్స సుబ్రహ్మణ్య కుమార్‌రాజు(28)కు అత్తిలి మండలం ఈడూరుకు చెందిన పావని(22)తో 2013 ఫిబ్రవరి 13న వివాహమైంది. నాలుగు నెలల క్రితం సుబ్రహ్మణ్య రాజు భార్య పావని, తన తల్లిదండ్రులతో కలిసి నగరానికి వచ్చి బాచుపల్లి రామచంద్రారెడ్డినగర్‌లోని వైష్ణవి సాయి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌లో అద్దెకుంటున్నాడు. ఖాజీ పల్లిలోని ప్రసాద్ స్టోన్ క్రషర్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి సూర్యనారాయణరాజు అక్కడే మెస్‌లో పనిచేస్తున్నాడు. కాగా పెళ్లైనప్పటి నుంచి పావని భర్తతో దాంపత్య జీవితానికి దూరంగా ఉంటోంది.
 
  గతేడాది డిసె ంబర్ 24న మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన సుబ్రహ్మణ్య రాజు భార్య ను బలవంతం చేయగా ఆమె ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురై కొట్టాడు. పావని తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయింది. చనిపోయిందని భావించిన అతను చీరతో ఫ్యాన్‌కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అనంతరం దోపిడీ దొంగల పనిగా ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసి బయట నుంచి తలుపు గడియపెట్టి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టుగా భార్య మృతదేహం వద్ద విలపించాడు. అనంతరం మృతదేహాన్ని ఈడూరుకు తరలించగా అక్కడికి వెళ్లిన సుబ్రహ్మణ్య రాజుపై మృతురాలి బంధువులు దాడిచేసి నిలదీయడంతో తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. అత్తిలి పోలీసులు దుండిగల్ పోలీసులకు సమాచారం అందించగా వారు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

Advertisement
 
Advertisement
Advertisement