'పవర్' చూపించిన రవితేజ అభిమానులు ... | Police Lathicharge on Hero Ravi Teja fans due to Power Cinema release | Sakshi
Sakshi News home page

'పవర్' చూపించిన రవితేజ అభిమానులు ...

Sep 12 2014 12:20 PM | Updated on Aug 21 2018 7:25 PM

'పవర్' చూపించిన రవితేజ అభిమానులు ... - Sakshi

'పవర్' చూపించిన రవితేజ అభిమానులు ...

హీరో రవితేజా నటించిన 'పవర్' సినిమా విడుదల నేపథ్యంలో శ్రీకాకుళం పట్టణంలోని సూర్యమహాల్ వద్ద ఉద్రికత్త నెలకొంది.

శ్రీకాకుళం: హీరో రవితేజ నటించిన 'పవర్' సినిమా విడుదల నేపథ్యంలో శ్రీకాకుళం పట్టణంలోని సూర్యమహాల్ వద్ద ఉద్రికత్త నెలకొంది. పవర్ సినిమా టికెట్లు సూర్యమహాల్ యాజమాన్యం బ్లాక్లో విక్రయించారని ఆరోపిస్తూ రవితేజ అభిమానులు సినిమా హాల్పై దాడి చేశారు. ఆ దాడికి సినిమా హాల్ యాజమాన్యం అడ్డు తగిలింది. దాంతో రవితేజ అభిమానులకు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది.

మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ హీరో రవితేజ అభిమానులు సినిమా హాల్ యాజమాన్యం సిబ్బందిపై తమ ప్రతాపాన్ని చూపించారు. రవితేజా అభిమానుల దాడిపై సినిమా హాల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హుటాహుటిన సినిమా హాల్ వద్దకు చేరుకుని... రవితేజ అభిమానులపై లాఠీ చార్జ్ చేశారు. దాంతో స్థానికంగా ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement