తిరుపతిలో పోలీసులు లాఠీఛార్జీ | police lathicharge in tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో పోలీసులు లాఠీఛార్జీ

Apr 21 2015 12:22 PM | Updated on Aug 21 2018 5:46 PM

నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తుండటంపై అటు విద్యార్థులు, ఇటు విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి.

తిరుపతి: నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తుండటంపై అటు విద్యార్థులు, ఇటు విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. దాంతో పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని... విద్యార్థులను ఆందోళన విరమించాలని కోరారు. అందుకు వారు ససేమిరా అనడంతో పోలీసులకు వారికి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. అయినా తాము ఇక్కడి నుంచి కదలే ప్రసక్తి లేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement