తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య | Police constable shoots himself dead in adilabad district | Sakshi
Sakshi News home page

తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

Jan 2 2014 9:00 AM | Updated on Mar 19 2019 6:01 PM

ఆదిలాబాద్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాశీపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీసాగర్ ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటనకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా లక్ష్మీసాగర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దానికితోడు పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు అధికం కావటంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement