పోలవరం నిర్వాసితుల ఫిర్యాదులు నిజమే | POLAVARAM occupants were complaints | Sakshi
Sakshi News home page

పోలవరం నిర్వాసితుల ఫిర్యాదులు నిజమే

Dec 8 2016 2:18 AM | Updated on May 29 2018 4:26 PM

పోలవరం నిర్వాసితుల ఫిర్యాదులు నిజమే - Sakshi

పోలవరం నిర్వాసితుల ఫిర్యాదులు నిజమే

పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులైన వారికి పునరావాస సహాయక చర్యల అమలులో లోపాలున్నాయని వారి తరఫున ‘రేలా’ సంస్థ నుంచి ఢిల్లీలోని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు

విజయసాయిరెడ్డి ప్రశ్నకు గిరిజన శాఖ సహాయ మంత్రి సమాధానం

 సాక్షి, హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులైన వారికి పునరావాస సహాయక చర్యల అమలులో లోపాలున్నాయని వారి తరఫున ‘రేలా’ సంస్థ నుంచి ఢిల్లీలోని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనని కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి జశ్వంత్ భాభోర్ తెలిపారు. వీటిపై ఆఫిడవిట్‌ను కూడా దాఖలు చేశామని చెప్పారు.

వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఎఫ్‌ఆర్‌ఏ-2006 చట్టం ప్రకారం పునరావాస సహాయక చర్యలు చూడాల్సింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలేనన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement