శ్రీవారిని దర్శించుకున్న పీఎం మోదీ, సీఎం జగన్‌

PM Narendra Modi Visits Tirumala Temple Today - Sakshi

సాక్షి, తిరుమల : భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి చేరుకున్న మోదీ..అక్కడ ప్రజా ధన్యవాద సభలో పాల్గొన్నారు. అనంతరం తిరుమలకు చేరుకున్న మోదీకి శ్రీవారి ఆలయం ఎదుట ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ ఈవో అనీల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో మోదీ మూడో సారి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంతకు ముందు 2015 అక్టోబర్‌ 3వతేదీ, 2017 జనవరి 3న మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top