పీజీ మెడికల్ కౌన్సెలింగ్ ఈనెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనుంది.
పీజీ మెడికల్ కౌన్సెలింగ్ ఈనెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో ట్యూషన్ ఫీజును 2 లక్షల 90 వేల రూపాయలుగా నిర్ణయించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అయితే మాత్రం దీన్ని 10,600 రూపాయలుగా మాత్రమే నిర్ణయించారు.
26, 27 తేదీల్లో ఓపెన్ కేటగిరి కౌన్సెలింగ్, 27, 28 తేదీల్లో రిజర్వేషన్ ప్రకారం కౌన్సెలింగ్, ఇక సర్వీస్ ప్రకారం అయితే 29, 30 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటాయని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.