రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం | person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Aug 24 2015 1:21 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఓదూరు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా, మహిళ తీవ్రగాయాలపాలైంది.

మహిళకు తీవ్రగాయాలు
 ఓదూరు (రామచంద్రపురం) : ఓదూరు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా, మహిళ తీవ్రగాయాలపాలైంది. రామచంద్రపురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బత్తుల వెంకట కృష్ణారావు (54) (సిద్ధాంతి) ఒక మహిళతో కలసి మోటారు సైకిల్‌పై కాకినాడ వైపు వెళుతున్నారు. ఓదూరు వద్దకు వచ్చేసరికి కాకినాడ నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ సంఘటనలో  వెంకట కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందగా, మహిళ తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను స్థానికులు 108 వాహనంలో రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement