'హంతకులను బహిరంగంగా కాల్చేసేలా శిక్ష విధించాలి' | Perni Nani comments on Anuhya Murderers | Sakshi
Sakshi News home page

'హంతకులను బహిరంగంగా కాల్చేసేలా శిక్ష విధించాలి'

Jan 18 2014 4:13 PM | Updated on Sep 3 2019 8:50 PM

ముంబైలో అనూహ్యను హత్య చేసిన హంతకులను బహిరంగంగా కాల్చేసేవిధంగా శిక్ష విధించి, అమలు చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ నేత పేర్ని నాని అన్నారు.

విజయవాడ: ముంబైలో అనూహ్యను హత్య చేసిన హంతకులను బహిరంగంగా కాల్చేసేవిధంగా శిక్ష విధించి, అమలు చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ నేత పేర్ని నాని అన్నారు. ముంబైలో దారుణంగా హత్యకు గురైన అనూహ్య భౌతికకాయానికి ఈ రోజు మచిలీపట్నంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ అనూహ్య మృతి దురదృష్టకరం అన్నారు.

చట్టాలు వచ్చినా మహిళలపై దాడులను ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులను బహిరంగా కాల్చేసే శిక్షలు అమలుచేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement