మోడీ వస్తే దేశం బాగుపడుతుంది: వెంకయ్య | People want Narendra Modi PM: M Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

మోడీ వస్తే దేశం బాగుపడుతుంది: వెంకయ్య

Sep 16 2013 11:59 AM | Updated on Mar 29 2019 5:57 PM

మోడీ వస్తే దేశం బాగుపడుతుంది: వెంకయ్య - Sakshi

మోడీ వస్తే దేశం బాగుపడుతుంది: వెంకయ్య

నరేంద్ర మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు అన్నారు.

నరేంద్ర మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు అన్నారు. మోడీ ప్రధాని అయితే దేశం బాగుపడుతుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ఆయనకు దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉందని తెలిపారు.

మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని అన్నారు. ఐక్యమత్యాన్ని సాధించే వ్యక్తి అని విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్లో మోడీ సాధించిన అభివృద్ధిని వెంకయ్య నాయుడు ప్రశంసించారు. 10 ఏళ్లుగా పదిశాతం వృద్ధిరేటు సాధస్తున్న రాష్ట్రం గుజరాత్ ఒక్కటేనని వెల్లడించారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రజలందరికీ అందాలన్న లక్ష్యంతో తమ పార్టీ పనిచేస్తోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement