
జగన్ దీక్షకు భారీ మద్దతు
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తణుకలో చేపట్టిన దీక్షకు భారీ మద్దతు వెల్లువెత్తింది.
కృష్ణా: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తణుకలో చేపట్టిన దీక్షకు భారీ మద్దతు వెల్లువెత్తింది. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగావైఎస్ జగన్చేపట్టిన రెండు రోజుల 'రైతు దీక్ష'కు మద్దతుగా గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలినాని ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆదివారం 75 కార్లలో తరలివెళ్లారు. అంతేకాకుండా పామర్రు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో జగన్ దీక్షకు మద్దతుగా భారీగా కార్యకర్తలు తరలివెళ్లారు.