ఇదేం ఏటీఎం బాబోయ్‌!

People facing ATM Problems In Pagidyala Kurnool - Sakshi

రూ. 500 నోటుకు బదులు రూ. 100  వస్తున్న వైనం

కర్నూలు, పగిడ్యాల: స్థానిక బస్టాండు సమీపంలో ఏర్పాటు చేసిన ఇండియా ఏటీఎంలో రూ. 500 నోటుకు బదులు రూ. 100 నోటు వస్తుండడంతో ఖాతాదారులు బెంబేలెత్తిపోయారు.   విద్యుత్‌ బిల్‌ రీడింగ్‌ ఆపరేటర్‌గా పనిచేసే  కేశవనాయుడు  గురువారం ఉదయం తన ఖాతా నుంచి ఏటీఎం ద్వారా రూ.2 వేలు డ్రా చేసేందుకు కంప్యూటర్‌లో నమోదు చేశాడు. అయితే కేవలం 4 వంద నోట్లు మాత్రమే వచ్చాయి. వెంటనే రూ.రెండు వేలు డ్రా చేసినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చినట్లు బాధితుడు వాపోయాడు. 

బీరవోలుకు చెందిన రాఘవరెడ్డి మొదటి సారి రూ. 500  డ్రా చేస్తే ఒక వంద నోటు రాగా మళ్లీ రూ. 4500 విత్‌డ్రా చేయగా వంద నోట్లు ఐదు రావడంతో లబోదిబోమన్నాడు. పగిడ్యాలకు చెందిన మరో వినియోగదారుడు నాగన్న రూ. 2వేలు డ్రా చేస్తే నాలుగు వంద నోట్లు వచ్చాయి. దీంతో అతడు వెంటనే మినీ స్టేట్‌మెంట్‌ తీయగా రూ.2 వేలు డ్రా చేసినట్లు వచ్చింది. చివరకు బాధితులు ఇండియా ఏటీఎం టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేశారు. అయితే కంపెనీ వారు ఏటీఎం కార్డు ఏ బ్యాంక్‌కు సంబంధించినదో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించినట్లు బాధితులు వాపోయారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top