‘చంద్రబాబు గుండెల్లో రైళ్లు’ | people are watching chandrababu mistakes: amjad basha | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు గుండెల్లో రైళ్లు’

Aug 3 2017 4:53 PM | Updated on Oct 19 2018 8:10 PM

‘చంద్రబాబు గుండెల్లో రైళ్లు’ - Sakshi

‘చంద్రబాబు గుండెల్లో రైళ్లు’

నంద్యాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా అన్నారు.

కర్నూలు: నంద్యాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా అన్నారు. టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా జనం భారీగా తరలి వచ్చారని అన్నారు.

నంద్యాల ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్‌లో బహిరంగ ప్రచార సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా అంజాద్‌ బాషా మాట్లాడుతూ చంద్రబాబునాయుడు చేస్తున్న కుట్రలను నంద్యాల ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ నెల 23న టీడీపీకి, చంద్రబాబునాయుడికి ప్రజలు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement