
సాక్షి, అమరావతి: అమరావతి రైతులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. శనివారం రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన తనలో మనసులో మాట బయట పెట్టారు. జై అమరావతి అనాలని పవన్‌ను రైతులు కోరగా.. జై అమరావతి అనలేనని.. జై అమరావతి అంటే మిగతా ప్రాంతాల్లో ఇబ్బంది వస్తుందని తెలిపారు. అన్ని ప్రాంతాలు ముఖ్యమేనని పేర్కొన్నారు. పవన్ మాటలకు రాజధాని రైతులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరోవైపు తన ప్రసంగాల్లో మాత్రం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే సహించేది లేదంటూ చెప్పడం గమనార్హం.