అన్నదమ్ముల్లా విడిపోదాం.. | partition the state like brothers | Sakshi
Sakshi News home page

అన్నదమ్ముల్లా విడిపోదాం..

Aug 17 2013 2:04 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో శాంతి సద్భావన ర్యాలీ జరిగాయి. టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో శాంతి సద్భావన ర్యాలీ జరిగాయి. టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వనజారెడ్డి, భాగ్యలక్ష్మీ, దేవేందర్, సోగల సుదర్శన్, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహెమూద్ పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. పట్టణ పురవీధుల గుండా ర్యాలీ కొనసాగింది. తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. నిర్మల్ పట్టణంలో టీఎన్‌జీవో, టీజేఏసీ, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శాంతి సద్భావన ర్యాలీ చేపట్టారు. అమరవీరుల స్తూపం వద్ద, అంబేద్కర్, రాంజీగోండు విగ్రహాలకు పూలమాలలు వేసి తెలంగాణ నినాదాలు చేశారు.
 
 ఇందులో టీజేఏసీ జిల్లా కన్వీనర్ కొట్టె శేఖర్, టీఎన్‌జీవో నిర్మల్ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోయినొద్దీన్, వి.విద్యాసాగర్, కోశాధికారి ఏ.వి.రమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శంకర్ పాల్గొన్నారు. మంచిర్యాలలో ఐబీ నుంచి పట్టణంలోని ముఖ్యవీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. బెల్లంపల్లి చౌరస్తాలో మానవహారం చేపట్టారు. రాజకీయ జేఏసీ తూర్పు జిల్లా చైర్మన్ గోనె శ్యాంసుందర్‌రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. కన్వీనర్ రవీందర్‌రావు, జేఏసీ నాయకులు తన్వీర్‌ఖాన్, సుదమల్ల హరికృష్ణ, పెద్దపెల్లి పురుషోత్తం, మంగ, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ నాయకులు నైనాల వెంకటేశ్వర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
  ఆసిఫాబాద్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో సద్భావన ర్యాలీ చేపట్టారు. జేఏసీ కన్వీనర్ గందం శ్రీనివాస్, ఆసిఫాబాద్ సర్పంచ్ కోవ లక్ష్మీ, రాజన్‌బాబు పాల్గొన్నారు.కాగజ్‌నగర్‌లో ఐఎన్‌టీయూసీ కార్యాలయం నుంచి రాజీవ్ చౌరస్తా వరకు శాంతి సద్భావన ర్యాలీ నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జేఏసీ నాయకులు సుభాష్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement