సెప్టెంబరులో 'పాలమూరు ప్రజాగర్జన': కిషన్ రెడ్డి | Palamuru Praja Gharjana in September: Kishan Reddy | Sakshi
Sakshi News home page

సెప్టెంబరులో 'పాలమూరు ప్రజాగర్జన': కిషన్ రెడ్డి

Aug 20 2013 6:06 PM | Updated on Mar 22 2019 2:59 PM

సెప్టెంబరు చివరి వారంలో 'పాలమూరు ప్రజాగర్జన' పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: సెప్టెంబరు చివరి వారంలో  'పాలమూరు ప్రజాగర్జన' పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఆ సభకు సుష్మాస్వరాజ్ హాజరవుతారని తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొట్టడం కాదు, నచ్చచెబుదాం అన్నారు. దాడులు, ప్రతిదాడులతో సమస్య పరిష్కారం కాదు.  అన్ని పార్టీల నేతలు  కలిసి  వెళ్లి వారితో మాట్లాడదామని చెప్పారు. కొత్త రాజధాని వస్తుందంటే వద్దనే రాజకీయ నేతలను ఇక్కడే చూస్తున్నానన్నారు.

హైదరాబాద్పై నిర్ణయం కాంగ్రెస్ సొంత నిర్ణయం కాదన్నారు. కాంగ్రెస్ సొంత బలంతోనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ కాదని చెప్పారు.  కేంద్రం ప్రతిపాదనలు పరిశీలించిన తరువాతే తెలంగాణ బిల్లుకు మద్దతు విషయం పరిశీలిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement