'బాబు పేరు ఎఫ్ఐఆర్లో చేర్చాలి' | P.Madhu takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'బాబు పేరు ఎఫ్ఐఆర్లో చేర్చాలి'

Jun 24 2015 10:28 AM | Updated on Aug 13 2018 8:10 PM

'బాబు పేరు ఎఫ్ఐఆర్లో చేర్చాలి' - Sakshi

'బాబు పేరు ఎఫ్ఐఆర్లో చేర్చాలి'

ఓటుకు కోట్లు కేసులో అసలైన ముద్దాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు.

కడప: ఓటుకు కోట్లు కేసులో అసలైన ముద్దాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బుధవారం కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో మధు విలేకర్లతో మాట్లాడారు. బాబు ప్రమేయంతోనే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపారనేందుకు అనేక ఆధారాలున్నప్పటికీ బుకాయిస్తున్నారని విమర్శించారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు సెక్షన్ -8ను తెరమీదకు తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అప్రజాస్వామికంగా గెలవాలనుకుంటోందని మధు విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement