పోలీసుల అదుపులో నకిలీ నోట్ల నిందితుడు | Ongole : Man Arrested With Fake Notes | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో నకిలీ నోట్ల నిందితుడు

Jun 24 2014 9:09 AM | Updated on Oct 9 2018 5:39 PM

ఒంగోలులో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఓ వ్యక్తిని మంగళవారం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఒంగోలులో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఓ వ్యక్తిని మంగళవారం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 75 వేల విలువ గల నకిలీ నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు టూటౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు.

 

పోలీసులు కథనం ప్రకారం... ఓ వ్యక్తి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నాడంటూ ఈ రోజు ఉదయం స్థానిక టూటౌన్ సీఐకు స్థానిక దుకాణదారుడు ఫిర్యాదు చేశాడు. దాంతో సీఐ హుటాహుటిన ఫిర్యాదుదారుడి వద్దకు వెళ్లి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసు స్టేషన్కు తరలించిన పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement