కృష్ణాలో గ్యాస్ లీకు | ONGC Gas leaked in krishna district | Sakshi
Sakshi News home page

కృష్ణాలో గ్యాస్ లీకు

Feb 22 2015 7:45 PM | Updated on Sep 2 2017 9:44 PM

ఓఎన్‌జీసీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్‌లో లీకేజీ వచ్చింది. దీంతో గ్యాస్, క్రూడ్ ఆయిల్ పెద్ద మొత్తంలో ఎగిసిపడుతోంది.

కృత్తివెన్ను (కృష్ణా జిల్లా): ఓఎన్‌జీసీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్‌లో లీకేజీ వచ్చింది. దీంతో గ్యాస్, క్రూడ్ ఆయిల్ పెద్ద మొత్తంలో ఎగిసిపడుతోంది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ నుంచి గ్యాస్, క్రూడ్ ఆయిల్ పెద్దమొత్తం ఎగిసిపడి పంట పొలాల్లో పడుతోంది. దీంతో రైతులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. మంటలు చెలరేగితే నష్టం భారీగా ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, రాజమండ్రి నుంచి ఓఎన్‌జీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement