వైఎస్సార్‌పీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి

One Year Completed YSRCP Government Formed In Andhra Pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి నేటికి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. 

ప్రకాశం: నేటికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణమోహన్ చీరాలలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చీరాల ప్రాంతంలోని పలు వృధాశ్రమాల్లో వృద్ధులకు వ్యవసాయ మార్కెట్ ద్వారా పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ సుధాకర్ వేసిన పిటిషన్‌ను సమర్ధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదన్నారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ విచారణకు ఆదేశించటపై ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానం సామాన్య విషయాలకు సైతం సీబీఐ విచారణకు ఆదేశిస్తుపోతే ప్రతి పోలీస్టేషన్ ఉన్న చోట కేంద్రం సీబీఐ ఆఫీసును ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన చెప్పారు. 

వైఎస్ఆర్: గత సంవత్సరం ఇదే రోజున 38 వేలపై చిలుకు ఓట్లతో ఎమ్మెల్యే గా గెలిపించిన రాజంపేట నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటికీ సరిగ్గా ఏడాది క్రితం అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఎన్నికైన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది క్రితం రాష్ట్రంలో నారాసుర పాలనకు చరమగీతం పాడి, 151 సీట్లతో అఖండ మెజారిటీతో వైఎస్సార్‌పీపీకి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సీఎం పదవి చేపట్టిన అనతికాలంలోనే రాజన్న పాలన మైమరిపించే ప్రజా సేవకుడు అనిపించుకున్నారని సీఎం జగన్‌ను ఆయన అభినందించారు.

అనంతపురం: వెస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి చేసకున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని మారంపల్లి కాలనీలో వంద మంది నిరుపేద కుటుంబాలకు చీరలను పంపిణీ చేశారు.

  • వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం పదవి చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆకాంక్షలను నేరవేరుస్తున్నారని తెలిపారు. జగన్‌పై విశ్వాసం ఉంచిన ప్రజలకు సుపరిపాలన అందుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీల్లో 90 శాతం ఏడాదిలోపే అమలు చేసిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిది అని ఆయన కొనియాడారు. ఆంధప్రదేశ్‌ అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. 


పశ్చిమ గోదావరి: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గోపాలపురంలోని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలోని పేషెంట్లు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా  జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే వి. ఆర్. ఎలిజా దివంగతనేత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

నెల్లూరు: వైఎస్సార్‌సీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన నిజయం సాధించి ఏడాది పూర్తైన  సందర్భంగా నాయుడుపేటలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేదలకు ఐదు రకాల పండ్లను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, నేతలు రాజారెడ్డి, కొల్ రామ కృష్ణమరాజు, ధనలక్ష్మి, అభిమానలు పాల్గొన్నారు.

విశాఖపట్నం: వైఎస్సార్‌పీపీ కార్యాలయంలో పార్టీ విజయోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఈ వేడుకల్లో  పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, విశాఖ ఎంపీ ఎం.వి. వి.సత్య నారాయణ, నగర అధ్యక్షులు శ్రీనివాస్ వంశీ కృష్ణ పాల్గొన్నారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే ఎస్ఎ రెహ్మాన్, ఈస్ట్ ఇంఛార్జి అక్రమాని విజయ నిర్మల, కొయ్య ప్రసాద్ రెడ్డి, మహిళా కన్వీనర్ గరికిన గౌరీ, పీలా వెంకట లక్ష్మీ, యువశ్రీ, రామలక్ష్మి పాల్గొన్నారు.

  • వైఎస్సార్‌పీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా పాడేరు మూడు రోడ్ల కూడలి వద్ద దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి అరుకు ఎంపీ గొడ్డేటి మాధవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొట్టగూలీ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. పాడేరు ఏరియా ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం‍లో పార్టీ నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.


తూర్పుగోదావరి: వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రి ఎంపీ కార్యాలయంలో ఎంపీ మార్గాని భరత్‌ వైఎస్సార్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ పటిష్టంగా ఉందని అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతోందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90% హామీలను సీఎం జగన్ అమలు చేశారని ఎంపీ  అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు మోషేన్ రాజు, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్తూరు: మే 23 చరిత్రలో మరిచిపోలేని రోజు అని చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రకటించిన నవ రత్నాలు ప్రజలు విశ్వసించడంతో భారీ ఎత్తున విజయాన్ని ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 90 శాతం మేరకు హామీలను నెరవేర్చి ప్రజారంజక నేతగా పేరుతెచ్చుకున్నారని ఆయన తెలిపారు.

కృష్ణా: వైఎస్సార్‌సీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీని సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేటికి ఏడాది పూర్తైన సందర్భంగా జిల్లాలోని భవానిపురం 39వ డివిజన్‌లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఆయన పేదలకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు చేయలేని పనులను సీఎం జగన్‌ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆర్థికంగా రాష్ట్రం వెకనబడినప్పటికీ సీఎం జగన్‌ ప్రజలకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న పరిశ్రమలు చంద్రబాబు నట్టేట్లో ముంచారని ఆయన మండిపడ్డారు.

  •  రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కావడంతో పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్‌ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి  కార్యకర్తలు, నాయకులకు అందజేశారు. నియోజవర్గంలో కృత్తివెన్ను, బంటుమిల్లి, గూడూరు, పెడన మండలాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
  • సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తెన సందర్భంగా పామర్రు నియోజకర్గ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగరవేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన రోజు సందర్భంగా తెనాలి, గుడివాడ, కొల్లిపరలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పేదలకు నిత్యావసర వస్తువులు, విద్యార్థులకు నోట్ బుక్స్, రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పిడుగురాళ్ల  వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో అభిమానుల మధ్య  గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కేక్  కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానలు పాల్గొన్నారు.

  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి మోపిదేవి వెంకటరమణ రేపల్లె వైఎస్సార్‌సీపీ ఆఫీసులో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పౌష్టికాహారం అందించారు. 

విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ చీపురుపల్లి పార్టీ ఆఫీసులో అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. 

  • రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏడాది అయి సందర్భంగా స్థానిక ఆర్టీసీ కూడలి వద్ద దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే జోగారావు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.
  • సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తీ చేసుకున్న సందర్భంలో బోగాపురంలోని సొసైటీ కార్యలయం వద్ద ఉన్న  దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి  ఎమ్మేల్యే అప్పలనాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని  రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 
  • వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి నేటికి ఏడాది పూర్తీ చేసుకున్న సందర్భంగా కురుపాంలో పార్టీ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. 
     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top