ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ : ఒకరు మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ : ఒకరు మృతి

Oct 26 2015 7:34 PM | Updated on Aug 30 2018 3:56 PM

రావులపాలెం మండలం రావులపాడు శివారు మల్లాయిదొడ్డి వద్ద జాతీయరహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది.

రావులపాలెం (తూర్పుగోదావరి) : రావులపాలెం మండలం రావులపాడు శివారు మల్లాయిదొడ్డి వద్ద జాతీయరహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు..  బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న తమలంపూడి సత్యనారాయణ రెడ్డి(55) అనే వ్యక్తి మృతిచెందారు. సత్యనారాయణరెడ్డి స్వగ్రామం ఆలమూరు మండలం జొన్నాడ గ్రామం. ఈయన గతంలో ఆలమూరు మండల ఇటుక బట్టీల అసోసియేషన్ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement