గుంటూరు జిల్లా శివారులోని గోరంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న టాటా ఏస్, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి.
గుంటూరు : గుంటూరు జిల్లా శివారులోని గోరంట్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న టాటా ఏస్, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో అమృతం రాజశేఖర్(17) అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. ఎనిమిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి గురైన ఇద్దరూ నారాయణ కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన పూర్ణచంద్రారెడ్డిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.