వెలుతురు కోసం దీపం పెడితే... | One burning alive in a fire accident | Sakshi
Sakshi News home page

వెలుతురు కోసం దీపం పెడితే...

Dec 31 2015 1:11 PM | Updated on Sep 5 2018 9:45 PM

ఇంట్లో వెలుతురు కోసం ఏర్పాటు చేసుకున్న దీపం.. ఓ వ్యక్తిని సజీవ దహనానికి కారణమైంది.

ఇంట్లో వెలుతురు కోసం ఏర్పాటు చేసుకున్న దీపం.. ఓ వ్యక్తిని సజీవ దహనానికి కారణమైంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుంజా తిరుపతమ్మ(30) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపుడుతోంది. ఈ రోజు ఇంట్లో దీపం అలాగే ఉంచి నిద్ర పోయింది. ప్రమాదవశాత్తు దీపం మంటలు ఎగిసిపడి పై కప్పుకు అంటుకోవడంతో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. దీంతో తిరుపతమ్మ మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement