
రాజధానిపై ముందే నిర్ణయమెందుకు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నుంచి నివేదిక రాక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రాజధాని ఎక్కడనే విషయంలో ఒక నిర్ణయానికి రావడమేమిటని శాసనమండలిలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సి.రామచంద్రయ్య తప్పుపట్టారు. ‘
చంద్రబాబు తీరును తప్పుపట్టిన కాంగ్రెస్ నేత రామచంద్రయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నుంచి నివేదిక రాక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రాజధాని ఎక్కడనే విషయంలో ఒక నిర్ణయానికి రావడమేమిటని శాసనమండలిలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సి.రామచంద్రయ్య తప్పుపట్టారు. ‘‘కేంద్రం కమిటీ వేసింది. దాని అభిప్రాయసేకరణ పూర్తికాక ముందే ఫలానా ప్రాంతంలో రాజధాని అంటూ మీ పేరుతో ప్రచారం జరగడం సరైంది కాదు’’ అని చంద్రబాబునుద్దేశించి అన్నారు.
దీనివల్ల ఇప్పటికే రాజధాని అవుతుందని చెబుతున్న ప్రాంతంలో రియల్టర్లు భూముల ధరలను ఇష్టమొచ్చినట్టు పెంచడం వల్ల సామాన్యుల ఇళ్లకు అందుబాటులో లేకుండా పోయాయని తప్పుబట్టారు.