ఆటో బోల్తా.. వృద్ధుని మృతి  | oldman died in road accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. వృద్ధుని మృతి 

Dec 18 2017 8:50 AM | Updated on Jul 6 2019 12:36 PM

సాక్షి, మర్రిపాడు : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడిన సంఘటనలో బాషా (60) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత‍్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించి కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement