బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడు | Older man arrested for sexually harassing girl | Sakshi
Sakshi News home page

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడు

Sep 22 2015 6:40 PM | Updated on Sep 3 2017 9:47 AM

దుకాణానికి వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కంకిపాడు (విజయవాడ) : దుకాణానికి వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బామర్ల శివరామకృష్ణ ప్రాసద్(64) అనే వృద్ధుడు తన ఇంటి సమీపంలోని దుకాణంలో సరుకులు కొనడానికి వచ్చిన తొమ్మిదేళ్ల బాలికతో సోమవారం రాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బెదిరిపోయిన బాలిక ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement