బాల్యవివాహాలను అడ్డుకున్న అధికారులు | Officials blocking of child marriages | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలను అడ్డుకున్న అధికారులు

Mar 3 2014 11:56 PM | Updated on Sep 2 2017 4:19 AM

జిల్లాలో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిపించాల్సిన రెండు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు.

 సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిపించాల్సిన రెండు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. అనంతరం వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. గ్రామస్తుల కథనం మేరకు.. చేగుంట మండలం కర్ణంపల్లికి చెందిన లచ్చవ్వ, నాగమల్లు దంపతుల పెద్ద కుమార్తె (16) పదో తరగతి చదువుతోంది. సిద్దిపేట మండలం తోర్నాల గ్రామానికి చెందిన ఐలవ్వ, కోమురయ్య దంపతుల రెండవ కుమారుడు శ్రీనివాస్ (22)తో వివాహం నిశ్చయమైంది.

ఈ క్రమంలో తోర్నాలలో సోమవారం ఉదయం పెళ్లి జరగాల్సిన సమయానికి సిద్దిపేట ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయ, సీనియర్ అసిస్టెంట్ బాలకిషన్, అంగన్‌వాడీ టీచర్లు, వీఓ లీడర్లు అమ్మాయికి పెళ్లీడు రాలేదని తల్లిదండ్రులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని సిద్దిపేట రూరల్ పోలీస్‌లకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లి వధూవరులను, వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో సీఐ ప్రసన్నకుమార్, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ అద్వర్యంలో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు వివాహం జరిపించమని అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులు, కుల పెద్దలు ఒప్పుకున్నారు.

దీంతో పెళ్లి ఆగిపోయింది.. చౌట్లపల్లిలో..
 మెదక్ రూరల్ : మెదక్ మండలం హవేళిఘణపూర్ పంచాయతీ పరిధిలోని చౌట్లపల్లి గ్రామంలో సోమవారం ఐసీడీఎస్ అధికారులు ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇదే మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన బొద్దబోయిన దుర్గయ్య, యాదమ్మల దంపతులు కుమార్తెను చౌట్లపల్లి గ్రామానికి చెందిన రాములు (22)తో వివాహం జరిపించాలని నిశ్చయించా రు. కాగా విషయం తెలుసుకున్న ఐసీడీఐసీ కో ఆర్డినేటర్ శంకర్, సూపర్ వైజ ర్లు, వింధ్యావాహిని, వసుమతిలు చౌట్లపల్లికి చేరుకుని వివాహాన్ని నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి  అప్పుడే వివాహం చేయమని రాతపూర్వకంగా రాయించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement