ఎంపీ కొత్తపల్లి గీతకు అరెస్ట్ వారెంట్ | non-bailable warrant against Araku mp kottapalli geetha in cheque bounce case | Sakshi
Sakshi News home page

ఎంపీ కొత్తపల్లి గీతకు అరెస్ట్ వారెంట్

Sep 22 2014 1:48 PM | Updated on Jul 11 2019 7:42 PM

విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతాకు నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ అయ్యింది.

హైదరాబాద్: విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతాకు నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సోమవారం ఆమెకు ఈ వారెంట్ జారీ చేసింది. కొత్తపల్లి గీత... విశ్వేశ్వరయ్య ఇన్ఫ్రాస్టక్చర్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్న ఆమె ఇచ్చిన చెక్కు చెల్లలేదు. దీంతో చెక్కు అందుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే కేసు విచారణ నిమిత్తం కొత్తపల్లి గీత కోర్టుకు హాజరు కాకపోవటంతో కోర్టు వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

 

Advertisement
 
Advertisement
Advertisement