రేపటి నుంచి నో పెట్రోల్‌..!

no helmet no fuel ; AP govt instructions - Sakshi

హెల్మెట్‌ లేకుంటే బంకులోకి అనుమతించరు

సీట్‌ బెల్ట్‌ పెట్టుకోని డ్రైవర్లను కూడా..

ప్రమాదాల నివారణకు సీఎం చంద్రబాబు కఠిన నిర్ణయాలు

ఏపీ వ్యాప్తంగా గురువారం నుంచి అమలులోకి..

అమరావతి : హెల్మెట్‌ ధరించని ద్విచక్రవాహనదారులకు, సీట్‌ బెల్టులు పెట్టుకోని డ్రైవర్లకు ఇధనాన్ని సరఫరా చేయరాదంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీచేశారు.

గురువారం ఉదయం నుంచే ఈ నిబంధన అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రహదారి భద్రతపై బుధవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ మేరకు తీసుకున్న కఠిన నిర్ణయాలను సీఎంవో మీడియాకు వెల్లడించింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యాంశాలివి..

హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఏపీలో ఇక తప్పనిసరి
రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు
రహదారి భద్రత కోసం వినియోగించే పరికరాల కొనుగోలుకు రూ.10 కోట్లు విడుదల
రవాణా వాహనాల యజమానులు తమ డ్రైవర్లకు ‘ఇంటి దగ్గర మీకోసం ఎదురుచూసే మనుషులున్నారు జాగ్రత్త’ అని బయలుదేరే సమయలో చెప్పాలి.
పోలీసు, రవాణా శాఖల్లో జవాబుదారితనం మరింత పెరగాలి.
రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై గుర్తించిన బ్లాక్ జోన్స్‌లో అసలు ఇబ్బంది ఏమిటో సత్వరమే గుర్తించి సరిచేయాలి. దీనిపై జాతీయ రహదారులు, పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయం చేసుకుని సమస్యను సత్వరం పరిష్కరించాలని సీఎం ఆదేశం
ప్రమాదాలకు కారణం అవుతున్న ఓవర్ లోడ్ ఆటోలను నియంత్రించాలి.
హదారి భద్రత పట్ల ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలి.
నెలవారీ సమీక్షలో అధికారుల అలసత్వం తేలితే కఠిన చర్యలు
ఎక్కువ శాతం ప్రమాదాలు కాపలా లేని కూడళ్లలో జరుగుతున్నాయి, అలాంటి చోట తక్షణమే కాపలా ఏర్పాటు చేయాలి.

పట్టణ ప్రాంతాల్లో, జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆదేశం. అవసరమైతే కమ్యూనిటీ పోలీసింగ్ వినియోగించుకోవాలని సూచన.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన శిక్షలు తప్పవు.
అన్ని స్కూల్ బస్సులకు, ఇతర పాసింజర్ వాహనాలకు స్పీడ్ గవర్నెన్స్ తప్పనిసరి
రాష్ట్రంలోని అన్ని వాహనాలకు జిపీయస్ అమర్చే అంశంపై పరిశీలన
ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులు, ట్రామాకేర్ సెంటర్ల వివరాలు వంటి   అవసరమైన సమాచారం లభించేలా ఒక ప్రత్యెక యాప్ తయారు చేయాలని సీఎం సూచన
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రహదారి ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, పోలిస్, రవాణ శాఖలు సంయుక్తంగా పని చేయడం వల్లే ఇది సాద్యమైందని కితాబు.
ప్రమాదాల్లో వెన్నుముక దెబ్బతిని శాశ్వత వైకల్యం పొందిన వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశం పరిశీలన
రహదారుల భద్రతకు వినియోగిస్తున్న వాహనాలు, 108 వంటి వాహనాలన్నీ జియో ట్యాగింగ్ చేయాలని,  ప్రమాద సమాచారం దగ్గరలో ఉన్న అన్ని వాహనాలకు అందేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top