
తన తండ్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారని, ఆయనకు రూ.8 లక్షల వరకు ఖర్చు అవ్వడంతో సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదని జగన్ వద్ద తుని మండలం రామకృష్ణా కాలనీకి చెందిన ఎం.వీరపాండు ఆవేదన వ్యక్తం చేశాడు. పది నెలల కిత్రం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదన్నాడు. పేద కుటుంబమైన మేము అప్పులు చేసి నాన్నగారికి వైద్యం చేయించామన్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.