‘ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌లో మార్పుల్లేవు’

No Change In AP Eamcet Counselling Schedule Minister Suresh Says - Sakshi

సాక్షి, అమరావతి : రేపటి ఎంసెట్‌ కౌల్సిలింగ్ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. బుధవారం నుంచి యధావిధిగా ఎంసెట్ కౌన్సిలింగ్‌ జరుగుతుందన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలకు అప్షన్లు ఇవ్వాలని సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ ప్రకారం రేపటి నుంచి యధావిధంగా జరుగుతుందన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శికి ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. రిజర్వేషన్లు, ఫీజులపై త్వరలో స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు.

రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు పెద్దపీట వేస్తామన్నారు. విద్యాశాఖలోని ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, త‍్వరలోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అమ్మఒడి పథకాన్ని ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ అమలు చేస్తామని తెలిపారు. రెండేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని మంత్రి సురేష్‌ వ్యాఖ్యానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top