ఎన్‌ఐఏ అదుపులో శ్రీనివాస్‌ | NIA Takes Accused In YS Jagan Attack Case | Sakshi
Sakshi News home page

Jan 12 2019 1:19 PM | Updated on Jan 12 2019 8:31 PM

NIA Takes Accused In YS Jagan Attack Case - Sakshi

ఎన్‌ఐఏ అదుపులో నిందితుడు శ్రీనివాసరావు

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును ఎన్‌ఐఏ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు.

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక భద్రత నడుమ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. (ఎన్‌ఐఏ కస్టడీకి శ్రీనివాసరావు)

శ్రీనివాసరావును విచారణ నిమిత్తం రోడ్డు మార్గం గుండా హైదరాబాద్‌ ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించనున్నారు. అక్కడే వారం రోజుల పాటు నిందితుడిని అధికారులు విచారించనున్నారు. నిందితుడిని వారం రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిందితుడికి మూడురోజులకోసారి వైద్యపరీక్షలు చేయించాలని, అతని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement