నవవధువు ఆత్మహత్య | newly wedded bride committed suicide | Sakshi
Sakshi News home page

నవవధువు ఆత్మహత్య

Mar 18 2016 6:33 PM | Updated on Nov 6 2018 7:56 PM

నెల రోజుల క్రితం పెళ్లైన నవవధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

నెల రోజుల క్రితం పెళ్లైన నవవధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మామిళ్లకుంట గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గువ్వల రాజుకు రంగలక్ష్మీ(22)తో గత నెల 20న పెళ్లైంది. కాగా.. ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో రంగలక్ష్మీ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement