పోలీసులను ఆశ్రయించిన కొత్త జంట | Newly married couple seeks Police protection | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన కొత్త జంట

Jun 1 2015 7:02 PM | Updated on Sep 17 2018 6:18 PM

ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట పెద్దల నుంచి రక్షణ కావాలంటూ సోమవారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

బంజారాహిల్స్ (హైదరాబాద్) : ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట పెద్దల నుంచి రక్షణ కావాలంటూ సోమవారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎన్‌బీటీ నగర్‌కు చెందిన వెంకటేష్(23)... రోడ్ నెం.10 సింగాడకుంట బస్తీకి చెందిన వినీతలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు చెప్పకుండా చిక్కడపల్లిలోని ఆర్య సమాజంలో గత నెల 20న వివాహం చేసుకున్నారు.

అయితే వినీత తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడంలేదంటూ అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వినీత, వెంకటేష్ కోసం గాలిస్తున్నారు. కాగా సోమవారం వారే స్వయంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి రక్షణ కావాలంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. నూతన జంటకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement