తెలంగాణలో టీజీ సిరీస్ పై వచ్చేవారం ప్రకటన | New vehicle registration code for Telangana likely next week | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టీజీ సిరీస్ పై వచ్చేవారం ప్రకటన

May 22 2014 3:21 PM | Updated on Sep 2 2017 7:42 AM

విభజన అనంతరం కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారం నోటిఫికేషన్ వెలువడనుంది.

హైదరాబాద్: విభజన అనంతరం కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారం నోటిఫికేషన్ వెలువడనుంది.
 
దేశరాజధాని కేంద్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాలను ప్రారంభించగానే జూన్ 2 తేదిన ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్ర వాహనాల రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారని అధికారులు వెల్లడించారు.  
 
తెలంగాణ కోసం టీజీ సిరీస్ ను కేటాయించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఓ ప్రతిపాదనను పంపింది. 
 
'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రతిపాదనను పంపింది. తెలంగాణ రాష్ట్రానికి కోడ్ కేటాయింపు చేయడానికి చర్యలు పూర్తయ్యాయి. అయితే కొన్ని ప్రభుత్వపరంగా కొన్ని లాంఛనాలు పూర్తి కావాల్సి ఉంది. వచ్చేవారం నోటిఫికేషన్ విడుదల చేస్తాం' అని రవాణా మంత్రిత్వ శాఖ పీటీఐ వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
Advertisement